డిఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఉపాధ్యాయ ట్రైనింగ్కు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు హెల్పింగ్ హ్యాండ్స్ డిఈడీ స్పెషల్ టీచర్ ట్రైనింగ్ కళాశాల కార్యదర్శి సంకాబత్తుల రజిత తెలిపారు. గురువారం స్థానిక కళాశాలలో విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేక విద్యలో డీఈడీ చదివితే చిన్న వయస్సులోనే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు.
ఓసీ విద్యార్థులకు 50శాతం ఎస్సీ, బీసీ, ఈడబ్ల్యుసీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు 45 శాతం ఇంటర్లో మార్కులు వచ్చిన వారు స్పెషల్ డిఈడీ చేయవచ్చన్నారు. బీఈడీ చేసిన వారు స్పెషల్ ఎడ్యుకేషన్ డిఈడీ చేస్తే స్పెషల్ బీఈడీతో సమానమ న్నారు. మెరిట్ ప్రకారం సీట్లు కేటాయించటం జరుగుతుందన్నారు. జూన్ 14 చివరి తేదీ అని, ఆసక్తి ఉన్న విద్యార్థులు 91549-47771, 91008-74698 నెంబర్లలో సంప్రదించాలని కోరారు.