Indian Railways 1007 Apprentice Jobs 2025 – Notification Out! Check Now

Indian Railways 1007 Apprentice Jobs 2024 – Notification Out! Check Now

రైల్వేలో ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. పదో తరగతి, ఐటీఐ అర్హతతో సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 1007 యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులకు 2025-26 సంవత్సరానికిగాను నాగుర్ డివిజన్, మోతిబాగ్ వర్క్షాప్ (నాగ్పుర్)లో అప్రెంటిన్షిప్ శిక్షణ ఇస్తారు. ఈ పోస్టులకు మే 4, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఇలాంటి మరెన్నో జాబ్స్ కోసం ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. Click here

ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్టీషియన్, స్టెనోగ్రాఫర్, ప్లంబర్, పెయింటర్, వైర్ మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, డీజిల్ మెకానిక్, మెషినిస్ట్, టర్నర్, పీఓపీఏ ట్రేడుల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏప్రిల్ 5న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు మే 4 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హత

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి, సంబంధిత ట్రేడ్లలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయస్సు 2025 ఏప్రిల్ 5 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, దివ్యాంగులకు, ఎక్స్-సర్వీస్మెను 10 ఏళ్లపాటు వయోపరిమితి సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

పదో తరగతి, ఐటీఐ పరీక్ష మార్కుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ఎంచుకుంటారు. తరువాత మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, యాక్ట్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.7700 – రూ.8,050 స్టైపెండ్ ఇస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 2025-26 సంవత్సరానికిగాను నాగుర్ డివిజన్, మోతిబాగ్ వర్క్షాప్ (నాగ్పుర్)లో అప్రెంటిస్ షిప్ శిక్షణ ఇస్తారు.

దరఖాస్తు విధానం

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేకు చెందిన అధికారిక వెబ్సైట్ https://secr.indianrailways.gov.in/చేసుకోని అప్లికేషన్ ఫారమ్లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు ఎంటర్ చేయాలి. తరువాత మీ విద్యార్హతలకు సంబంధించిన, అవసరమైన అన్ని పత్రాలు అప్లోడ్ చేయాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించకుండానే మే 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండి
https://t.me/KbrGowthamDeals

Work From Home Jobs In Telugu click here

Leave a Comment