AP Tribal Welfare Gurukul Class VIII and Inter Admissions

ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ.. 2025-26 విద్యా సంవత్స రానికి సంబంధించి ఎనిమిదో తరగతి, ఇంటర్మీడి యట్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు అర్హులై న గిరిజన బాలబాలికల నుంచి దరఖాస్తులు కోరు తోంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితోపాటు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలు నీట్, జేఈఈ, ఈఏపీసెట్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఉంటుంది.

మొత్తం సీట్ల సంఖ్య: 780.

• సీట్ల వివరాలు: ఎనిమిదో తరగతి-180, ఇంటర్ (ఎంపీసీ)-300, ఇంటర్ (బైపీసీ)-300.అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఎనిమిదో తరగతి ప్రవేశ పరీక్షకు అర్హులు. ప్రభుత్వ గుర్తింపు పొం దిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరం పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశ పరీక్షకు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.

• పరీక్ష విధానం: ఎనిమిదో తరగతికి ఏడో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉం టుంది. తెలుగు(10 మార్కులు), ఇంగ్లిష్(10 మార్కులు), హిందీ(10 మార్కులు), మ్యాథ్స్ (20 మార్కులు), ఫిజికల్ సైన్స్(15 మార్కు లు), బయోసైన్స్(15 మార్కులు), సోషల్ స్టడీస్(20 మార్కులు) సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఇంటర్కి పదో తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇంగ్లిష్ (20 మార్కులు), మ్యాథ్స్(40 మార్కులు), ఫిజికల్ సైన్స్(20 మార్కులు), బయోసైన్స్ (20 మార్కులు) సబ్జెక్టుల నుంచిప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా..

ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 02.03.2025

Web site : https://twreiscet.apcfss.in/

ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్ లో వచ్చిన విద్య ఉద్యోగ సమాచారం కొరకు ప్రతి ఒక్కరూ మన వాట్సప్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://whatsapp.com/channel/0029VamzbZeGufJ065d5uc33

మీకు కావాల్సిన వస్తువులు టీవీ ఫీజు ఏసి వాషింగ్ మిషన్ మొబైల్ కంప్యూటర్ లాప్టాప్ ఏవైనా తక్కువ ధరలో కొనాలనుకుంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వండిhttps://t.me/KbrGowthamDeals